: ఇద్దరు సైనికులను సజీవ దహనం చేసిన ఐఎస్ఐఎస్
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బందీలుగా పట్టుకున్న ఇద్దరు టర్కీ సైనికులను అత్యంత పాశవికంగా సజీవదహనం చేసిన వీడియోను విడుదల చేశారు. సిరియాలోని వివిధ పట్టణాల్లో గతంలో సత్తాచాటిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ప్రస్తుతం రెబల్స్ చేతుల్లో ఘోరపరాజయం చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలెప్పోలో తమకు పట్టుబడ్డ ఇద్దరు టర్కీ సైనికులను గొలుసులతో బంధించారు. అనంతరం వారిని ఎడారిలోకి మోకాళ్లపై నడిపిస్తూ తీసుకెళ్లి వారిని ఇంధనంతో తడిపి, వారి మెడకు కట్టిన పొడుగాటి ఫ్యూజ్ కు రిమోట్ తో నిప్పంటించారు. ఇంధనంతో తడిసిన దుస్తులకు నిప్పంటుకోవడంతో వారు హాహాకారాలు చేస్తూ సజీవదహనమయ్యారు. ఈ వీడియో ఆరంభంలో రెబల్స్ తో చేస్తున్న యుద్ధం విజువల్స్ ను పెట్టారు. అనంతరం ఈ సజీవదహనం దృశ్యాలు దర్శనమిస్తాయి. దీనిని టర్కీలో నిషేధించారు.