: 'ప్యాసింజర్' సినిమాలో మానవత్వం గురించి చెప్పాం: జెన్నీఫర్ లారెన్స్, క్రిస్ ప్రాట్


క్రిస్ మస్ సందర్భంగా హాలీవుడ్ లో విడుదలైన 'ప్యాసింజర్' సినిమాలో మానవత్వం గురించి చర్చించామని ప్రధాన పాత్రలు పోషించిన జెన్నీఫర్ లారెన్స్, క్రిస్ ప్రాట్ తెలిపారు. ఈ సినిమాలో వర్ణ వివక్ష గురించి చర్చించామని, రంగులను బట్టి మనుషులను వర్గీకరించడం మనం నేర్చుకున్నామని, రంగును మినహాయిస్తే మిగిలిందంతా ఒకటేనన్న విషయాన్ని మర్చిపోతున్నామని తెలిపారు. మనం ప్రయాణించే సందర్భంలోనే ఇతరులు కూడా వారి అవసరాల కోసం వారు ప్రయాణిస్తుంటారని, అలాంటి సమయాల్లో వారిని అవమానించడం, మార్గమధ్యంలో దించేయడం వంటి చర్యలు ఎలాంటి ప్రతిచర్యలు, ప్రతిఘటనకు దారితీస్తాయన్న విషయాన్ని కూడా ఈ సినిమాలో చర్చించామని అన్నారు. సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామని వారిద్దరూ చెప్పారు. 

  • Loading...

More Telugu News