: హైదరాబాదులో రాంచరణ్, ఉపాసన, అఖిల్, రకుల్ లతో ఫుల్ ఎంజాయ్ చేశాను: తమన్నా
హైదరాబాదులో తమన్నా పుట్టిన రోజు ఘనంగా జరిగింది. 'ధృవ' విజయంతో మంచి జోరుమీదున్న రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అఖిల్, ఉపాసనతో ఆనందంగా గడిచిపోయిందని తమన్నా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంకా పుట్టినరోజు ఫీలింగ్ లోనే ఉన్నానని తమన్నా పేర్కొంది. ఈ సందర్భంగా చెర్రీతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా రకుల్ తో కలిసి గ్రీన్ టీ తాగానని, ఇది ఉపాసనకు ఇష్టం లేదని చెప్పింది. ఈ ఫోటోను కూడా పోస్టు చేసింది. మీ అందర్నీ కలవడం ఆనందంగా ఉందని అఖిల్ కూడా ట్వీట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను వీరంతా పోస్టు చేశారు. ఈ ఫోటోలు వారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.