: పాకిస్థాన్ అధ్యక్ష భవనం నా ప్రసంగాన్ని కొట్టేసింది...: కోర్టు కెక్కిన 11 ఏళ్ల కుర్రాడు


పాకిస్థాన్ కు చెందిన 11 ఏళ్ల కుర్రాడు సంచలనం సృష్టించాడు. దేశ అధ్యక్షుడి కార్యాలయం తన ప్రసంగ పాఠాన్ని చౌర్యం చేసిందంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన ప్రసంగాన్ని చౌర్యం చేయడమే కాకుండా తన అనుమతి లేకుండా దాన్ని ఉపయోగించనట్టు అతడు ఆరోపించాడు. ఇస్లామాబాద్ కు చెందిన మొహమ్మద్ సబీల్ హైదర్ ఆరో తరగతి చదువుతున్నాడు. తాను ఈ నెల 22న అధ్యక్షుడి భవనంలో ప్రసంగించాల్సి ఉందని, పాక్ జాతి పిత మొహమ్మద్ అలీ జిన్నా జయంతి సందర్భంగా తన ప్రసంగ కార్యక్రమం ఈ నెల 25న పాకిస్థాన్ టెలివిజన్ లోనూ ప్రసారం కావాల్సి ఉందని తెలిపాడు. అయితే, తాను అధ్యక్ష కార్యాలయానికి చేరుకోగా ప్రసంగించే అవకాశం లేదని తనకు చెప్పి పంపించేశారని అతడు పేర్కొన్నాడు. కానీ, తాను రూపొందించుకున్న ప్రసంగాన్ని మరో విద్యార్థి చదివి వినిపించాడని, ఇది తన మేధో ఆస్తిని చోరీ చేయడమేనని తన పిటిషన్ లో సబీల్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు తన తీర్పును ఇవ్వాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News