modi: నేడు ముంబయికి మోదీ రాక.. రూ.3,600 కోట్లతో నిర్మించనున్న శివాజీ స్మారకానికి శంకుస్థాపన
ఆరేబియా సముద్రంలోని ఓ ద్వీపంలో నిర్మించతలపెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారకానికి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఇందుకోసం మరికాసేపట్లో నరేంద్ర మోదీ ముంబయికి బయలుదేరనున్నారు. 192 మీటర్ల ఎత్తుతో శివాజీ విగ్రహాన్ని అద్భుతంగా నిర్మించనున్నారు. ఈ శివాజీ స్మారకం కోసం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రెండు మెట్రోరైలు ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే రాయగఢ జిల్లాలోని ఎంఐడీసీ పతల్‌కంగాలో నిర్మించిన ‘నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మేనేజ్‌మెంట్’ ప్రాంగణం కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభం కానుంది.