: గుడ్ న్యూస్‌.. న‌గ‌దు ర‌హితానికి ప్రోత్సాహ‌కాలు రెడీ.. రేప‌టి నుంచే ల‌క్కీ డ్రా


న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రుపుతున్న వారికి గుడ్ న్యూస్‌. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌జ‌ల‌ను క్యాష్‌లెస్ లావాదేవీల‌వైపు ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ల‌క్కీ గ్రాహ‌క్ యోజ‌న‌, డీజీ-ధ‌న్ వ్యాపార్ యోజ‌న వంటి ప‌థ‌కాల‌ను రేప‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా వంద న‌గ‌రాల్లో ప్రారంభించ‌నున్నారు. వంద రోజుల పాటు కొన‌సాగే ఈ ప‌థ‌కాల్లో వారానికి ఒక‌సారి చొప్పున డ్రా తీసి విజేత‌ల‌ను ఎంపిక చేస్తారు. ల‌క్కీ గ్రాహ‌క్ యోజ‌న కింద దేశవ్యాప్తంగా రోజుకు 15 వేల మందికి వెయ్యి రూపాయ‌ల చొప్పున‌, వారానికి ఒక‌సారి రూ.5వేలు, రూ.10 వేలు, రూ. ల‌క్ష చొప్పున బ‌హుమ‌తులు అందిస్తారు. డీజీ-ధ‌న్ వ్యాపార్ యోజ‌న కింద వ్యాపారుల‌కు రూ.50 వేల ప్రోత్సాహ‌కం అందిస్తారు. ఏప్రిల్ 14న ఈ ప‌థ‌కాల‌కు మెగా డ్రా తీస్తారు.

  • Loading...

More Telugu News