: సంగారెడ్డి జిల్లాలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జిల్లాలోని గుమ్మడిదల మండలం అనంతారంలోని వెంకటరాఘవ ల్యాబ్‌లో డీఆర్ ఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ వెలుగుచూశాయి. రూ.3.5 కోట్ల విలువైన అల్ఫాజోలం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్‌ను ఉపయోగించి మత్తుమందు తయారుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోనూ డీఆర్ ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.