: సింధుకు నంబర్ వన్ ఖాయం.. జోస్యం చెప్పిన ప్రకాశ్ పదుకొనే
మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు నంబర్ వన్ ర్యాంకు సాధిస్తుందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే జోస్యం చెప్పారు. సరైన శిక్షణ, సరైన షెడ్యూల్, టోర్నీల మధ్య విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్తే ఆమె సరైన దిశగానే వెళ్తున్నట్టు భావించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం ఆమెతోపాటు కోచ్ గోపీచంద్‌కు కూడా బాగా తెలుసని అన్నారు. మరో ఐదారేళ్లపాటు మెరుగైన ఆటతీరు ప్రదర్శించే సత్తా ఆమెకు ఉందని ప్రకాశ్ అన్నారు. అగ్రశ్రేణి షట్లర్లను ఓడించిన సింధు అదే ఆటతీరును మున్ముందు కనబరుస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడున్న ప్రశ్న అని పేర్కొన్నారు. ఆమె ప్రదర్శన నిలకడగా ఉంటే నంబర్ వన్ ర్యాంకు పెద్ద విశేషమేమీ కాదని అన్నారు.