: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనవే.. మరో 50 ఏళ్లు మనదే పాలన!: చంద్రబాబు
స్థానికంగా మంచి నాయకత్వం కనుక ఉంటే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకే వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలోని 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు. పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరో 50 ఏళ్లు మన పాలనే ఉంటుందని జోస్యం చెప్పారు.
ఏ నియోజకవర్గంలోనైనా పార్టీ ఓడిపోతే అది స్థానిక నాయకత్వ లోపంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవడం వల్లే నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారని, వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.