: తెలంగాణలో జోనల్ విధానం రద్దు : సీఎం కేసీఆర్
తెలంగాణలో జోనల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై రాష్ట్ర, జిల్లా స్థాయి కేడర్లే ఉంటాయని, సర్వీసు నిబంధనలు, విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగ సంఘాల నేతలతో అధికారులు చర్చించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, వారి అర్హతల మేరకు పది రోజుల్లోగా వారిని ఉద్యోగాల్లో నియమించాలని, భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ప్రాంతంలో పని చేసేలా బదిలీలు చేయాలని, అన్ని శాఖల్లో ఈ విధానం తక్షణం అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.