: పర్మిట్లతోనే బస్సులు నడుపుతున్నాం!: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తెలంగాణలో పర్మిట్లు లేకుండా ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారని తమపై ఆరోపణలు గుప్పించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. శ్రీనివాస్ గౌడ్ కు దమ్ముంటే ఈ ఆరోపణలను నిరూపించాలని జేసీ సవాల్ విసిరారు. ఈ ఆరోపణలు అవాస్తవమని, పర్మిట్లతోనే తమ ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నామని జేసీ స్పష్టం చేశారు.