: మహిళలు, చిన్నారులను వదిలిపెట్టడానికి అంగీకరించిన హైజాకర్లు.. తొలివిడతగా 25 మంది విడుదల!


లిబియాకి చెందిన ఆఫ్రీకియా ఎయిర్‌ లైన్స్‌ విమానం హైజాక్ కు గురైన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విమానంలో ఉన్న ఇద్దరు హైజాకర్లతో జరిపిన చర్చల్లో పురోగతి సాధించారు. విమానంలోని బందీలలో మహిళలను, చిన్నారులను విడిచిపెట్టేందుకు ఒప్పించారు. విమానంలో మొత్తం 118 మంది ఉండగా, వారిలో ఏడుగురు సిబ్బంది, 111 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 28 మంది మహిళలు, ఒక శిశువు ఉన్నారు. వీరిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తొలి విడతగా 25 మందిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్...లిబియా ప్రధాని ఫయీజ్ అల్ సెర్రాజ్‌ తో మాట్లాడారు. 

  • Loading...

More Telugu News