: రాజమహేంద్రవరంలో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ !
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజమహేంద్రవరంలో సందడి చేశారు. కాకినాడ సర్పవరంలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్ నేరుగా కాకినాడ వెళ్లారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ వెంట సోదరుడు, నటుడు కల్యాణ్ రామ్ కూడా ఉన్నారు.