: జానీమూన్ నా కూతురితో సమానం: మంత్రి రావెల


గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు స్పందించారు. జానీమూన్ తన కూతురితో సమానమని, ఆమె భర్త తనకు అల్లుడితో సమానమని అన్నారు. పార్టీ వేదికల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడటం సబబుకాదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప,  ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించాల్సిన అవసరం ప్రతిఒక్కరికీ ఉందన్నారు. తానే స్వయంగా వెళ్లి జానీమూన్ తో మాట్లాడతానని ఈ సందర్భంగా రావెల పేర్కొన్నారు. కాగా, మంత్రి రావెల నుంచి తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీకి జానీమూన్ ఫిర్యాదు చేశారు. ఈరోజు జెడ్పీ కార్యాలయంలో తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
 

  • Loading...

More Telugu News