: ‘వంగవీటి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వంగవీటి రాధాకృష్ణ .. డీజీపీకి ఫిర్యాదు
రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వంగవీటి’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ చిత్రంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని డీజీపీ సాంబశివరావుకు వంగవీటి రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ సినిమాను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని, తమను సంప్రదించకుండానే ఈ చిత్రాన్ని తీశారని, ఇందులోని పాత్రలు అవాస్తవంతో ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో రాధాకృష్ణ కోరారు.