: చిత్రమైన ట్వీట్ పెట్టి విమర్శలపాలైన పరిణితి చోప్రా


బాలీవుడ్ నటి పరిణితి చోప్రా సోషల్ మీడియాలో తన ఫోటోతో పాటు పెట్టిన వ్యాఖ్య ఆమెను విమర్శలపాలు చేసింది. ప్రస్తుతం యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పరిణితి 'మేరీ ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉన్న సందర్భంగా తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెడుతూ, 'సెట్ లో ఫుల్ డస్ట్ ఉంది. క్రూ మొత్తం మాస్క్ లు ధరించారు. ఇంత అందంగా ఉంది మా ప్రొడక్షన్' అంటూ వ్యాఖ్య జత చేసింది.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మాస్క్ లు ధరించారు అని అర్థం వచ్చేలా ఈ పోస్టు చేసింది. అయితే ఈ ఫోటోలో పరిణితి ఒక్కతే మాస్క్ ధరించి ఉంది. వెనుక అందరూ మామూలుగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ, 'నీకు ఒక్కదానికే మాస్క్ ఉంది. ఓసారి ఫోటోలు చూడు' అంటూ విమర్శలు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News