: లిబియాలో విమానం హైజాక్... బాంబులతో బెదిరింపు...మాల్టా ఎయిర్ పోర్టులో హైఅలెర్ట్
లిబియాలో విమానం హైజాకైంది. ఆఫ్రిక్వీయ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ-320 విమానం సబ ఎయిర్ పోర్ట్ నుంచి ట్రిపోలి వెళ్తుండగా హైజాక్ కు గురైంది. ఈ సమయంలో విమానంలో సిబ్బందితో కలిసి 118 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైజాక్ సమాచారం తెలుసుకోగానే విమానాన్ని అధికారులు మాల్టా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. తమ డిమాండ్లు తీర్చకపోతే విమానాన్ని పేల్చేస్తామంటూ హైజాకర్లు బాంబులు చేతుల్లో పట్టుకుని బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. కాగా, హైజాకర్ల డిమాండ్లపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో మాల్టా ఎయిర్ పోర్టులో హైఅలెర్ట్ జారీ చేశారు. విమానాశ్రయాన్ని భద్రతాధికారులు చుట్టుముట్టారు.