: ఏడు సెషన్ల తర్వాత... లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఏడురోజుల పాటు వరుసగా నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మాత్రం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 61.10 పాయింట్లు లాభపడి 26,040.70 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 6.65 పాయింట్లు లాభపడి 7,985.75 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే, సెన్సెక్స్ 26 వేల కీలక మద్దతు స్థాయిని అందుకోగా, నిఫ్టీ మాత్రం 8 వేల స్థాయిని చేరలేకపోయింది. సిప్లా, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, బాష్, బజాజ్ ఆటో తదితర సంస్థల షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, అరబిందో ఫార్మా, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్ మొదలైన సంస్థల షేర్లు నష్టాల బాట పట్టాయి.