: ప్రతి నటుడు వీటన్నిటినీ గుర్తుంచుకోవాలి!: హృతిక్ రోషన్


'కాబిల్' సినిమా తన కెరీర్ లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ తెలిపాడు. 'కాబిల్' ప్రమోషన్ లో మాట్లాడుతూ, ప్రతి నటుడు పాత్రలో లీనమవ్వడం సర్వసాధారణమని చెప్పాడు. దర్శకుడు చెప్పిన దానిని సమర్థవంతంగా, అభిమానులు, ప్రేక్షకులను మెప్పించేలా నటించి చూపించాలని, ఈ లాజిక్ మర్చిపోతే సినిమా విజయవంతం కాదని అన్నాడు. కాబిల్ కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని హృతిక్ చెప్పాడు. నిత్యవిద్యార్థిగా ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చని అన్నాడు. సినిమా షూటింగ్స్ లో తన తండ్రితో తాను ఎంజాయ్ చేసినంత ఎక్కువగా తన కుమారులు తనతో ఎంజాయ్ చేయడం లేదని హృతిక్ వాపోయాడు. 

  • Loading...

More Telugu News