: నా దృష్టిలో హాస్యనటులు నిజమైన హీరోలు: సలోని
తన దృష్టిలో హాస్యనటులు నిజమైన హీరోలని ప్రముఖ నటి సలోని చెప్పింది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకు మొదటి నుంచి హాస్యం అంటే చాలా ఇష్టమని, హాస్యనటులతో కలిసి నటించేటప్పుడు సెట్ లో బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తానని చెప్పింది. అటువంటి వాతావరణంలో షూటింగ్ చేస్తుంటే అసలు పనిచేసినట్టే అనిపించదని తన మనసులో మాట చెప్పింది. అయితే, నటించడం ఎక్కడైనా, ఎవరితోనైనా ఒకటేనని.. హాస్యనటులతో ఒకలా, మిగతా నటులతో మరోలా నటించడమని ఏమీ ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా సలోని చెప్పింది.