: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన... పలువురు వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఇటీవలే ప్రకటించిన వైసీపీ నాయకురాలు, కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఈ రోజు విజయవాడలో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు టీడీపీలో 14 మంది వైసీపీ ఎంపీటీసీలు, ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు, 12 మంది సర్పంచ్‌లు, 4 మండలాల వైసీపీ అధ్యక్షులు కూడా టీడీపీలో చేరారు. వారినందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.