: అమీర్ ఖానా? మజాకా?...బుక్ మై షో సర్వర్ డౌన్ చేసిన 'దంగల్'


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. 'దంగల్' సినిమా అద్భుతమంటూ సెలబ్రిటీలంతా చిత్రయూనిట్ ను ప్రశంసించడం, అమీర్ నటనను ఆకాశానికెత్తేయడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. సినిమాపై నమ్మకంతో వివిధ వర్గాలకు వారం రోజుల ముందే అమీర్ వ్యక్తిగత ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. దీంతో విమర్శకులు కూడా ఈ సినిమాపై పాజిటివ్ గా రాయడం ఆరంభించారు. దీంతో సినిమా విజయంపై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

 ఈ నేపథ్యంలో 'దంగల్' సినిమా నేడు ధియేటర్లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పట్టణాల్లో ఈ సినిమా చూసేందుకు సోషల్ మీడియా సినిమా టికెటింగ్ యాప్ బుక్ మై షో.కామ్ ను నెటిజన్లు ఆశ్రయించారు. దీంతో సినిమా చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా పోటెత్తడంతో ఆ వెబ్ సైట్ సర్వర్ డౌన్ అయిపోయింది. కొంత మందికి ఎర్రర్ సమాధానం రాగా, మరి కొందరికి పేమెంట్ ఆప్షన్ వద్ద సర్వర్ లోడ్ అవుతూ కనిపించింది. దానిని రీ ఫ్రెష్ చేస్తే టికెట్లు ఫుల్ అయిపోయిన మెసేజ్ రావడంతో అమీర్ అభిమానులు నిరాశచెందారు. 

  • Loading...

More Telugu News