: ఆ రికార్డును కూడా సొంతం చేసుకుంటా: కేఎల్ రాహుల్
ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా యువ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 199 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. దీనిపై రాహుల్ స్పందించాడు. రానున్న రోజుల్లో ద్విశతకం బాదుతానని ఆత్వవిశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఇండియాలో కేవలం ఇద్దరికే సాధ్యమైన ట్రిపుల్ సెంచరీని సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతానని చెప్పాడు.
డబుల్ సెంచరీని మిస్ కావడం చాలా బాధగానే ఉందని... అయితే, క్రికెట్లో ఇవన్నీ సర్వసాధారణమే అని రాహుల్ అన్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే డకౌట్ కావడం... డబుల్ సెంచరీనీ మిస్ కావడం... ఇలాంటివన్నీ మన ఊహకు అందవని చెప్పాడు. మిడిల్ స్టంప్ కు వస్తుందనుకున్న బంతి ఆఫ్ స్టంప్ బయటకు వెళ్లిందని... ఆ బాల్ ను వదిలేద్దామనే అనుకున్నానని, కానీ అనవసరంగా ఆడానని... దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయందని తెలిపాడు. కాకపోతే మంచి స్కోర్ చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. నెక్స్ట్ సీజన్ లో సెహ్వాగ్, కరుణ్ నాయర్ ల రికార్డ్ బద్దలుకొట్టడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.