: ఫోర్బ్స్ జాబితాలో వరుసగా సల్మాన్, షారుఖ్, కోహ్లీ.. 33వ స్థానంలో మహేశ్ బాబు


ఫోర్బ్స్-2016 ప్రముఖుల జాబితాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తొలిస్థానాన్ని ఆక్రమించాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచారు. గత ఏడాది ఇదే జాబితాలో షారుఖ్ తొలి స్థానంలో, సల్మాన్ రెండో స్థానంలో, కోహ్లీ ఏడో స్థానంలో నిలిచారు. ఖాన్ లు ఇద్దరూ తమ స్థానాలను మార్చుకోగా... కోహ్లీ మాత్రం ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకాడు. సంపాదన, ఫాలోయింగ్ ఆధారంగా ఫోర్బ్స్ పత్రిక ఈ స్థానాలను కేటాయిస్తోంది. అయితే, కేవలం ఇమేజ్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే... విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలిచాడు.

 ఈ ఏడాదికి సంబంధించి ఫోర్బ్స్ మేగజీన్ టాప్-100 ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టును నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే 6వ స్థానంలో, ప్రియాంక చోప్రా 8వ స్థానంలో నిలిచారు. దక్షిణాది విషయానికి వస్తే.... రజనీకాంత్ 30వ స్థానంలో నిలిచారు. మన తెలుగు హీరోలు మహేశ్ బాబు 33వ స్థానం, అల్లు అర్జున్ 43వ స్థానం, జూనియర్ ఎన్టీఆర్ 55వ స్థానం, రాంచరణ్ 67వ స్థానంలో నిలిచారు. 

  • Loading...

More Telugu News