: ఈసారి వచ్చినపుడు అందరమూ కలిసి తిందాం: కేసీఆర్


"మరో రోజు ఎర్రవల్లి వస్తాను. ఆ రోజు సామూహిక భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. మీతో కలసి భోజనం చేస్తాను. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను మరింత అభివృద్ధి చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిద్దాం" అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన దత్తత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఆనందంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రెండు గ్రామాలనూ నగదు రహిత గ్రామాలుగా ప్రకటించిన ఆయన, ప్రజలు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండి, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఇప్పటివరకూ మనం ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమేనని, ఈ స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణంలో మరిన్ని అడుగులు వేయాల్సి వుందని అన్నారు. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరపడంలో తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా చేయాలన్న నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు కమ్యూనిటీ హాల్ ను, కల్యాణ మండపాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News