: హైదరాబాద్ లో దారిమళ్లిన రూ. 1.88 కోట్ల ఏటీఎం డబ్బు
ఓవైపు బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేక జనాలు అల్లాడిపోతుంటే... మరోవైపు చేతివాటం చూపిస్తున్నారు మరికొందరు. హైదరాబాదులో రూ. 1.88 కోట్ల ఏటీఎం డబ్బు దారిమళ్లిందన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. కస్టోడియన్ సిబ్బంది ఈ డబ్బును కొట్టేసినట్టు అనుమానిస్తున్నారు. ఆడిటింగ్ లో ఈ విషయం వెల్లడి కావడంతో అధికారులు అవాక్కయ్యారు. సీసీఎస్ సిబ్బంది రంగంలోకి దిగి, దర్యాప్తును ప్రారంభించారు.