: ఫోన్ చేసి మంత్రాలు చదువుతున్నారు... వణికిపోతున్న జనాలు


అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది. ఇంత రాత్రి పూట ఫోన్ వచ్చింది... బంధువులకు కానీ, మిత్రులకు కానీ ఎవరికైనా ఏమైనా అయిందా అనే ఆదుర్దాతో ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అంతే, అవతలి నుంచి ఫోన్ లో మంత్రాలు వినిపిస్తాయి. దీంతో, ఫోన్ లిఫ్ట్ చేసిన వారికి గుండెలు జారిపోతాయి. ఈ వింత ఫోన్ కాల్స్ ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతంలో వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియదు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి, మంత్రాలు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో, ఫోన్ లో మంత్రాలు విన్న వారు చనిపోతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో, రాత్రిపూట ఫోన్ ఎత్తాలంటేనే జనాలు హడలిపోతున్నారు.

  • Loading...

More Telugu News