: పవన్ ఓ అగ్నిపర్వతం... దమ్మున్నోడు: రామ్ గోపాల్ వర్మ


అవకాశం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ట్విట్టర్లో చెలరేగిపోయే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి రూటు మార్చాడు. తన దృష్టిలో పవన్ ఓ అగ్నిపర్వతంలాంటి వాడని చెప్పాడు. గుడగుడలాడుతూ పొగ వదులుతుంటాడని... సమయం వచ్చినప్పుడు మాత్రం భారీ విస్ఫోటనంలా పేలుతాడని అన్నాడు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను పవన్ నిశితంగా గమనిస్తున్నారని... వచ్చే ఎన్నికల్లో దుమ్మురేపుతారని చెప్పాడు. పవన్ కు ఆ దమ్ము ఉందని తెలిపాడు. వచ్చే ఏడాది జయలలిత స్నేహితురాలు శశికళపై సినిమా తీస్తానని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News