: అవినీతిపై మరిన్ని కఠిన చర్యలు.. నోట్ల రద్దు అందులో ఒకటి మాత్రమే.. తేల్చి చెప్పిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
అవినీతిపై పోరుకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోనుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తేల్చి చెప్పారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం అవినీతిపై తీసుకున్న ఆఖరు చర్య కాదని అన్నారు. నోట్ల రద్దును నల్లధనంపై ముఖాముఖి దాడిగా అభివర్ణించిన అరవింద్, నల్లకుబేరులకు మున్ముందు మరిన్ని షాకులు ఉంటాయన్నారు. పన్నురేట్లు తగ్గించడం, సరళీకరించడం వంటి చర్యలను కేంద్రం చేపడుతుందని వివరించారు. ఫలితంగా అవినీతిపరులు నల్లధనం పోగేసుకోకుండా పలు విధానాలను తీసుకొస్తుందని తెలిపారు. ప్రధాని పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశంలోని మెజారిటీ ప్రజలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.