: సహారా ఎడారిలో మంచు కురిసింది !


ఎడారి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘సహారా’.  పగటి వేళల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. వడగాలులూ నిప్పు సెగలు కురిపిస్తుంటాయి. అయితే, ప్రపంచంలోనే పెద్దదైన సహారా ఎడారిలో మంచు కురిసింది. అల్జీరియాలోని అయిన్ సెఫ్రా పట్టణ సమీపంలోని ఎడారిలో మంచు కురవడంతో ఇసుక దిబ్బలు తెల్లగా మారిపోయి కొత్త అందాలను సంతరించుకున్నాయి. ఈ అందాలు ‘సహారా’ సందర్శకులకు మరపురాని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాగా, సెఫ్రా పట్ణణ సమీపంలో మంచు కురిసిన విషయాన్ని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ముప్ఫై ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ మంచు కురిసిన విషయాన్ని ఈ సందర్భంగా అక్కడి వృద్ధులు గుర్తుచేసుకున్నారు. 

  • Loading...

More Telugu News