: విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీలో ముసలం... జిల్లా అధ్యక్షుడి రాజీనామా
విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీలో ముసలం బయల్దేరింది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కినుక వహించిన విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొలగట్ల వీరభద్రస్వామి పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయని, బొత్స సీనియర్ రాజకీయ నాయకుడు కావడంతో జిల్లా రాజకీయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన కొలగట్ల రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.