: అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పోటీలో ఉంటా: అన్నా డీఎంకే ఎంపీ శశికళ పుష్ప


అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయనున్నట్టు బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తెలిపారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, పార్టీ నుంచి తనను బహిష్కరించలేదని అన్నారు. ఏఐఏడీఎంకే ఎంపీగా కొనసాగుతున్నానని తెలిపింది. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ కు వ్యతిరేకంగా శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జయలలితను చంపేందుకు శశికళ నటరాజన్‌ ప్రయత్నించారని, దీనిపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

కాగా, పార్టీ పగ్గాలు చేపట్టాలని అంతా శశికళను కోరుతున్నారన్న వార్తల నడుమ, తాను కూడా పోటీలో ఉన్నానని శశికళ పుష్ప ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. ఇది రేపు వెలువడే మద్రాసు హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. 75 శాతం మంది కార్యకర్తలు పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదని ఆమె అన్నారు. అసలామె పార్టీ సభ్యురాలు కూడా కాదని ఆమె కొత్త వాదన వినిపించారు. 

  • Loading...

More Telugu News