: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా అనిల్ బైజల్?
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తన పదవికి ఈరోజు రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ పదవిలో నియమించేందుకు ఐఏఎస్ మాజీ అధికారి అనిల్ బైజల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం అనిల్ బైజల్ ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా, ఎయిర్ ఇండియా సీఎండీగా, ప్రసారభారతికి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కాగా, గతంలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ గా నియమించాలని ఆయన పేరును ప్రభుత్వం పరిశీలించింది.. బీజేపీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో అనిల్ బైజల్ యూనియన్ హోం సెక్రటరీగా పనిచేశారు.