: బండి కొంటే పార్కింగ్ ప్లేస్... ఇల్లు కట్టుకోవాలంటే టాయిలెట్ ఉండాలట! ... కేంద్రం పరిశీలనలో కొత్త సంస్కరణలు!


పెద్దనోట్ల రద్దు స్కీం ఇచ్చిన ఆనందంతో ఎన్డీఏ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది. వాటి గురించిన వివరాల్లోకి వెళ్తే... గతంలోలా డ్రైవింగ్ వచ్చిందని,  లైసెన్స్ ఉందని బైక్ కొనుగోలు చేద్దామంటే కుదరదు. ఇకపై బైక్ కొనుగోలు చేయాలంటే పార్కింగ్ ప్లేస్ ఉందని నిరూపించాలి. లేని పక్షంలో బైక్ కొనుగోలుకు అవకాశం ఉండదని తెలుస్తోంది. అలాగే డబ్బులు సంపాదించాం, ఒక ఇల్లు కట్టుకుందామంటే కూడా కుదరదని తెలుస్తోంది. ఇల్లు కట్టాలంటే ముందుగా టాయిలెట్ కట్టేందుకు స్థలం కేటాయించామని అధికారులకు చూపించాలని, అప్పుడే ఇల్లు కట్టేందుకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. గూగుల్ టాయ్ లెట్ లొకేటర్ ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ వివరాలు వెల్లడించడం విశేషం. 

  • Loading...

More Telugu News