: 'నా భార్యే నిర్మాత అయితే మంచి జీతం వస్తుందన్న' బాలీవుడ్ స్టార్ హీరో


సినీ నిర్మాతగా రంగప్రవేశం చేయనున్నానన్న తన భార్య టీనా (ట్వింకిల్ ఖన్నా) ప్రకటన వాస్తవమేనని ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు. ముంబైలో అక్షయ్ మాట్లాడుతూ, టీనా స్వతంత్ర భావాలుగల వ్యక్తి అని అన్నాడు. తన భార్య నిర్మాత కానుండడం గర్వంగా ఉందని అక్షయ్ చెప్పాడు. తన భార్యే నిర్మాత అయితే తన జీతం పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమాలకు దూరమైన అనంతరం టీనా ఇంటిని చూసుకుంటూ, రచయితగా రాణిస్తూ, కుటుంబ కంపెనీ 'ద ఫార్ అవే ట్రీ', తన వ్యక్తిగత కంపెనీ 'ద వైట్ విండో'ని సమర్థవంతంగా నిర్వహించిందని తెలిపాడు. ఇన్ని పనులు సమర్థవంతంగా చక్కబెట్టిన తన భార్య నిర్మాతగా రాణించలేదా? అంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News