: చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కరీంనగర్ ఫస్ట్ క్లాస్ అడిషినల్ కోర్టు ఈరోజు సంచలన తీర్పు నిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న సదరు బాలిక హత్యకు గురైంది. కేసుపై చార్జిషీటు దాఖలైన ఆరు నెలల వ్యవధిలోనే కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు.. కాటారం మండలం దామెరకుంటకు చెందిన నిందితుడు జక్కుల వెంకటస్వామి, అదే గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం ఆమెను హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు చూపించడంతో వెంకటస్వామికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.