: నజీబ్ జంగ్ రాజీనామా షాక్ కు గురి చేసింది: కేజ్రీవాల్


తమ రాష్ట్ర గవర్నర్ నజీబ్ జంగ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం తనను షాక్ కు గురి చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో గవర్నర్ రాజీనామాపై ఆయన మాట్లాడుతూ, అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేశారని తెలియగానే ఫోన్ చేశానని,  రాజీనామాకు గల కారణాలు అడిగానని తెలిపారు. రేపు ఆయనతో నేరుగా భేటీ అయిన తరువాత ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకుంటానని ఆయన చెప్పారు. కాగా, 2013లో గవర్నర్ గా నియమితుడైన నజీబ్ జంగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో వివాదం సందర్భంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News