: నా జీవితం పూల పానుపు కాదు: రవిచంద్రన్ అశ్విన్
తన కెరీర్ పూలపానుపు కాదని టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ఇయర్ తో పాటు, ఐసీసీ టెస్టు జట్టులో చోటు సంపాదించుకోవడంతో అన్ని క్రీడా వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన కెరీర్ పూల పానుపు కాదని, అందులో ముళ్లు కూడా ఉన్నాయని తెలిపాడు. అయితే ఆ ముళ్లు అడ్డు రాకుండా ఉంటే కనుక తాను సాధించిన దానిలో సగం కూడా సాధించి ఉండేవాడిని కాదని చెప్పాడు. ఈ సందర్భంగా తనను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో భాగమైన తన తల్లిదండ్రులు, భార్య ప్రీతి, కోచ్ శ్రీధర్, భరత్ అరుణ్, బసు, కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు.