: మరో బాంబు పేల్చిన కేసీఆర్!
ఇటీవలే ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులపై ఆకర్షణ వల విసిరిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు.. మరికొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు! మలి విడత ఆపరేషన్ ఆకర్షలో భాగంగా మరో 15-20 మంది శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
కేసీఆర్ నేడు ఓ వార్తా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల కారణంగా టీఆర్ఎస్ పార్టీ కేడర్ కు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. ఇక ఎప్పట్లానే, తెలంగాణ వస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.