: సినీ పరిశ్రమలో వారసులకే అవకాశాలెక్కువంటున్న బాలీవుడ్ భామ కృతి సనోన్!
మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాతో సినీపరిశ్రమకు పరిచయమైన మోడల్ కృతి సనోన్ బాలీవుడ్ లో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ, అవకాశాలు నిలదొక్కుకోవడంపై తన అభిప్రాయాలు పంచుకుంది. సినీ పరిశ్రమలో వారసులకే అవకాశాలు ఎక్కువ వస్తాయని తెలిపింది. సినీ పరిశ్రమతో సంబంధం ఉండడం, చిన్నప్పటి నుంచి వారిని గమనిస్తూ ఉండడంతో స్వశక్తితో బయటి నుంచి వచ్చిన వారికంటే వారసులకే ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పింది. అంతే కాకుండా సినీ పరిశ్రమ వారికి దన్నుగా నిలుస్తుందని చెప్పింది. ఎక్కువ అవకాశాలు రావడంతో తమని తాము నిరూపించుకునే అవకాశం వారికి దొరుకుతుందని తెలిపింది. ఎటువంటి సినీ నేపథ్యం లేనివారికి అవకాశాలతో పాటు బ్యాకప్ కూడా దొరకదని చెప్పింది. ఈ విషయం తెలిసే తాను సినీ పరిశ్రమలోకి వచ్చానని, ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలకు, వాటిలో ప్రదర్శించిన నటనకు సంతృప్తిగా ఉన్నానని చెప్పింది.