: ఆర్బీఐ పూటకో నిబంధనతో తీవ్ర ఇబ్బందులు: వీహెచ్


పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ పూటకో నిబంధన అమలులోకి తీసుకొస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ చేపడుతున్న చర్యలు నల్లకుబేరులకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్న వారికి అనుకూలంగాను, స్వల్పకాలిక రుణాలు పొందిన వారికి గుదిబండగాను మారాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని ఆయన చెప్పారు. బతుకమ్మకు పూర్వవైభవం తేవాలని, హనుమాన్ వ్యాయామ శాలలకు మరిన్ని హంగులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ను కోరానని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News