: టీడీపీలోకి మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు?


వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ, టీడీపీలోకి మరికొంత మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరెవరు చేరబోతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వైసీపీ అధినేత జగన్ నాయకత్వ వైఫల్యం, భవిష్యత్తుపై బెంగ, తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలన్న ఆకాంక్షతోనే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ఆయన తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News