: వీసా గడువు ముగిసినా ఉన్నందుకు పాకిస్థాన్ లో భారతీయుడికి జైలు శిక్ష
ఓ భారతీయుడికి పాకిస్థాన్ లోని స్థానిక కోర్టు జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే, రెహనూర్ రెహ్మాన్ అనే భారతీయుడు పాకిస్థాన్ కు వెళ్లాడు. డిసెంబర్ రెండవ వారంలో అతని వీసా గడువు ముగిసిపోయింది. అయినప్పటికీ అతను పాక్ లోనే ఉండటంతో.... లాహోర్ లోని కంటోన్మెంట్ ఏరియాలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలో ఉన్నాడంటూ కేసును నమోదు చేశారు. అతడిని నిన్న కంటోన్మెంట్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రవేశపెట్టగా... మూడున్నర నెలల పాటు జైలు శిక్షను విధించింది కోర్టు. శిక్షా కాలం ముగిసిన వెంటనే అతడిని భారత్ కు పంపించేయాలని ఆదేశించింది.