: నన్నెందుకు దూరం పెట్టారు?: ఇలియానా ఆవేదన
టాలీవుడ్ ను గోవా బ్యూటీ ఇలియానా ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఇల్లీ దెబ్బకు అప్పటి దాకా ఉన్న హీరోయిన్లంతా వెనుకపడిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ ఇలియానానే. అలాంటి ఇలియానా ఇప్పుడు తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. దక్షిణాది సినీ పరిశ్రమ తనను దూరం పెట్టేసిందని బాధపడుతోంది. టూ పీస్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో అందాలను ఆరబోసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.
అందాల ఆరబోతకు తాను సిద్ధమన్నట్టు సంకేతాలు ఇచ్చినా... ఆమె అందాలవైపు ఏ దర్శకుడు, నిర్మాత, హీరో చూడలేదు. దీంతో, చాలా మథనపడిపోతోంది ఇల్లీ. మొన్నామధ్య ఓ తెలుగు దర్శకుడు ఇలియానాను కలిసి ఓ కథ చెప్పాడట. సినిమాలో మీరే హీరోయిన్ అంటూ నమ్మబలికాడట. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడట. ఇప్పుడు అదే సినిమాలో వేరే హీరోయిన్ నటిస్తోందట. ఇలా ఎందుకు చేశారంటూ సదరు దర్శకుడికి ఫోన్ చేసి అడిగితే... 'సారీ' అని చెప్పి ఫోన్ పెట్టేశాడట. బాలీవుడ్ మీద మోజుతో దక్షిణాది సినిమాలను వదులుకుని ముంబై చెక్కేసిన ఇలియానా... అక్కడ ఛాన్సులను సంపాదించుకోవడంలో ఫెయిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటి, రెండుకు మించి సినిమాలు లేవు. దీంతో, అక్కడా సినిమాలు లేక, ఇక్కడా సినిమాలు లేక తెగ బాధపడుతోంది ఇలియానా.