: అమర్యాదగా ఏమీ ప్రవర్తించలేదు.. నాపై చర్యలు వద్దు: ప్రివిలేజ్ కమిటీ ముందు నాని
అసెంబ్లీలో తాను ఎన్నడూ అమర్యాదగా ప్రవర్తించ లేదని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరైన ఆయన, గత సమావేళాల్లో జరిగిన ఘటనలపై వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో తానేమీ అసభ్యకరంగా ప్రవర్తించలేదని, ప్రజల మనసుల్లోని ఆందోళన, భయాలను సభకు తెలిపానని, తనపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సభా హక్కుల సంఘాన్ని ఆయన కోరారు. కమిటీ ముందుకు కొడాలి నానితో పాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా హాజరై తమ వివరణలు వినిపించారు.