: 2016 ఐసీసీ బెస్ట్ వన్డే జట్టులో కెప్టెన్ సహా ముగ్గురు మనోళ్లే... డ్రీమ్ టీమ్స్ వివరాలివే!
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొద్దిసేపటి క్రితం ప్రకటించిన 2016 బెస్ట్ వన్డే జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం దక్కింది. ఇటీవలి కాలంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఈ డ్రీమ్ టీమ్ కు సైతం కెప్టెన్ గా నిలిచాడు. జట్టులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఎంపికయ్యారు. ఇదే సమయంలో ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో ఏకైక భారతీయుడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలువగా, ఈ జట్టు సారధిగా అలిస్టర్ కుక్ ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో నలుగురు చొప్పున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు; భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు.
వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), వార్నర్, డి కాక్, రోహిత్ శర్మ, డెవిలియర్స్, బట్లర్, మిచెల్ మార్ష్, జడేజా, స్టార్క్, రబాడా, సునీల్ నరైన్, తాహిర్.
టెస్టు జట్టు: అలిస్టర్ కుక్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఆడం వోజెస్, జానీ బెయిర్ స్టో (కీపర్), బెన్ స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, రంగన హెరాత్, మిచెల్ స్టార్క్, డేల్ స్టెయిన్, స్టీవెన్ స్మిత్