: మందు తాగి.. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడి.. రచ్చ రచ్చ చేసిన యువతి!


ఫుల్లుగా మద్యం తాగిన ఓ యువతి రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడి... పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇది తన వ్యక్తిగత విషయమంటూ పోలీసులపై తిరగబడింది. ఈ ఘటన కరీంనగర్ లో జరిగింది. అయితే, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే, నలుగురు యువకులతో కలసి డ్రంకన్ డ్రైవ్ లో సదరు యువతి పట్టుబడింది.

"మేం వయసులో ఉన్నాం... బయటకు వెళ్తున్నాం... మీకు అర్థం కావడం లేదా... ఆధారాలు కావాలా?" అంటూ పోలీసులను ప్రశ్నించింది. చుట్టూ ఉన్నవాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ, "ఏంటలా చూస్తున్నారు. ఇది మా పర్సనల్ ప్రాబ్లం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్" అంటూ దుర్భాషలాడింది. మరోవైపు, పక్కనున్న యువకులు మాత్రం తమను వదిలేయాలంటూ పోలీసులను బతిమాలుకున్నారు. ఆమెకు మద్యం తాగే అలవాటు లేదని... తొలిసారి తాగిందని... క్షమించి వదిలేయాలని కోరారు. ఈ తతంగమంతా వీడియోలో రికార్డు కావడంతో... ఈ ఘటన వెలుగుచూసింది. వీరికి ఫైన్ విధించి, పోలీసులు వదిలేసినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News