modi: చొరబాట్లను ప్రోత్సహించేందుకు సరిహద్దుల్లో పాక్ కాల్పులు జరుపుతోంది: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో మదన్ మోహన్ మాలవ్య కేన్సర్ కేంద్రానికి ఈ రోజు ఉదయం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కేన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల వైద్యుల పని మరింత సులువుగా మారిందని అన్నారు. దేశంలో మానవ వనరులకు కొదవలేదని, దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మోదీ అన్నారు.125 కోట్ల భారతీయులపై తనకు నమ్మకం ఉందని, దేశం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళుతుందని అన్నారు.
దేశానికి ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తున్నామని మోదీ అన్నారు. భారత్‌లో చొరబాట్లను ప్రోత్సహించేందుకు సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులు జరుపుతోందని, వాటిని భారత సైన్యం తిప్పికొడుతోందని చెప్పారు. దేశ అభివృద్ధిని సాధించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కుంటున్నామని చెప్పారు.