: పూర్తిగా కోలుకున్న కమలహాసన్


దేశం గర్వించదగ్గ విలక్షణ నటుడు కమలహాసన్ పూర్తిగా కోలుకున్నారు. తన ఆఫీసులో జరిగిన ప్రమాదంలో కమల్ గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో, ఆయన హాస్పిటల్ లో చేరారు. ఈ క్రమంలో ఆయన సినిమా శభాష్ నాయుడు షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు కమల్ చాలా ఫిట్ గా ఉన్నారట. కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించని కమల్... చెన్నై ఎయిర్ పోర్టులో హఠాత్తుగా మెరిశారు. కమల్ కోలుకున్నాడన్న వార్తతో ఆయన అభిమానులంతా సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు, జనవరి మొదటి వారంలో శభాష్ నాయుడు సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News