: తిరుమలలో నెలల బాలుడిని వదిలి వెళ్లిన వ్యక్తులు
పేగు బంధం భారమైందో లేదా మరేదైనా కారణమో.. తెలియదు కానీ, ఈ ఉదయం తిరుమలలోని కల్యాణకట్ట వద్ద నెల రోజుల వయసున్న బాలుడిని గుడ్డల్లో పెట్టి వదిలి వెళ్లారు గుర్తు తెలియని భక్తులు. బాబు ఏడుస్తూ ఉండటాన్ని చూసి గమనించిన కొందరు యాత్రికులు విషయాన్ని టీటీడీ అధికారులకు చేరవేశారు. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో బాలుడు ఉన్నాడని, బాబు గురించి ఎవరూ రాకుంటే, టీటీడీ నిర్వహిస్తున్న శిశు సంరక్షణాలయానికి తరలిస్తామని అధికారులు తెలిపారు. కల్యాణకట్ట ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.